గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన చంద్రిక యుగంధర్ ప్రముఖ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్ (యాంకర్)గా విశిష్టమైన సేవలు అందించి, హైదరాబాద్‌లోని త్యాగరాయ జ్ఞానసభలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని విశిష్ట ప్రతిభా పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి చెందిన మైత్రి ఫౌండేషన్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ శాలువా కప్పి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని గుమ్మడిదల పేరు మరింత ప్రతిష్ఠ పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నవీన్ సాగర్,మణికంఠ,ఉదయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డు అందుకున్న మహిళా యాంకర్‌కు సన్మానం
RELATED ARTICLES

