Saturday, August 1, 2026
Home Blog

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్?.. అక్రమ నిర్మాణంపై చర్యలు ఎక్కడ!అక్రమ నిర్మాణానికి అధికారుల అండ ఉందన్న ఆరోపణలుకూల్చివేయాలని ఉత్తర్వులిచ్చినా అమలుకాని ఆదేశాలుప్రైవేట్, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని బాధితుడి విజ్ఞప్తి

జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు మెదక్ జిల్లా యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణంపై కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితుడు యామవరం రఘువీర శర్మ ఆరోపిస్తున్నారు.బాధితుడి కథనం ప్రకారం, తనకు చెందిన స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే జీ+2 భవన నిర్మాణం చేపట్టారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన విచారణలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనతో పాటు సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వ భూమి, డ్రైనేజీ కాలువలపై నిర్మాణాలు జరిగినట్లు సంబంధిత అధికారుల నివేదికలో నమోదైనట్లు ఆయన తెలిపారు.ఈ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ చట్టం–2018లోని నిబంధనల మేరకు అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. అవసరమైతే పోలీసు బందోబస్తుతో కూల్చివేత చేపట్టాలని, మొత్తం వ్యవహారాన్ని సంబంధిత మండల అధికారులు పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు.అయితే కలెక్టర్ ఉత్తర్వులు వెలువడి నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు కనిపించలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పారు. చిన్నపాటి నిర్మాణాల విషయంలో వెంటనే స్పందించే అధికారులు, ఈ వ్యవహారంలో మాత్రం మౌనం పాటించడం పట్ల స్థానికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం మరోసారి జోక్యం చేసుకుని కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంతో పాటు అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు యామవరం రఘువీర శర్మ విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ ఆదేశాలు డోంట్ కేర్..- అక్రమ నిర్మాణానికి అధికారుల అండ…- కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టిన అధికారులు!- బాధితుడికి అన్యాయం.. అక్రమార్కులకు డీపీఓ సంపూర్ణ సహకారమని ఆరోపణలు!- అధికార పార్టీ నేతల ఒత్తిడితో చర్యలకు వెనుకంజ అనే విమర్శలు!- ప్రైవేట్ స్థలం, ప్రభుత్వ స్థలం కబ్జా చేసినా చోద్యం చూస్తున్న యంత్రాంగమని బాధితుడి ఆవేదన!

జిల్లా అత్యున్నతాధికారి కలెక్టర్ హోదాలో స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయి అధికారుల్లో చలనం కనిపించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదని బాధితుడు యామవరం రఘువీర శర్మ ఆరోపిస్తున్నారు.బాధితుడి కథనం ప్రకారం, తనకు చెందిన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే సండ్రు రామచంద్ర రెడ్డి, సండ్రు ప్రతాప్ రెడ్డిలు జీ+2 భవనాన్ని నిర్మించారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన డీఎల్‌పీఓ ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించి సీసీ రోడ్డు వైపు వదలాల్సిన సెట్‌బ్యాక్‌లో కాంపౌండ్ వాల్, గేటు నిర్మించడమే కాకుండా తనకు చెందిన 40 గజాలు, ప్రభుత్వానికి చెందిన సుమారు 50 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అలాగే గ్రామంలోని 13 మీటర్లు, 3 మీటర్ల డ్రైనేజీ కాలువలపై కూడా కాంపౌండ్ వాల్ నిర్మించి, ప్రజలకు ఉపయోగపడే నీటి ట్యాప్‌ను సైతం ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.ఈ నివేదిక ఆధారంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ స్పందించి, పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 90, 94, 114 ప్రకారం అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు తెలిపారు. అవసరమైతే పోలీసు బందోబస్తుతో కూల్చివేత చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించడంతో పాటు, మొత్తం వ్యవహారాన్ని యెల్దుర్తి మండల పంచాయతీ అధికారి పర్యవేక్షించి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని గత మే 20న ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.అయితే కలెక్టర్ ఆదేశాలు వెలువడి నెలలు గడిచినా అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. కూల్చివేత చేపట్టాల్సిన పంచాయతీ కార్యదర్శి, పర్యవేక్షించాల్సిన మండల అధికారులు కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం లేదని, దీనికి జిల్లా పంచాయతీ అధికారుల సహకారం కూడా ఉందని ఆరోపించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.సామాన్యులు చిన్నపాటి నిర్మాణం చేపట్టినా వెంటనే నోటీసులు జారీ చేసే అధికారులు, ప్రైవేట్ స్థలంతో పాటు ప్రభుత్వ భూములు, డ్రైనేజీలపై నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కలెక్టర్ ఆదేశాలకు విలువ లేదా?: బాధితుడు యామవరం రఘువీర శర్మ”యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో మా పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌కు ఫిర్యాదు చేశాను. విచారణలో ఆక్రమణలు నిజమేనని తేలడంతో మే 20న నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కొన్ని ఇటుకలు తొలగించి చర్యలు తీసుకున్నట్లు చూపించారు. అధికారులు అక్రమార్కులకు మద్దతుగా నిలవకుండా, జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి” అని బాధితుడు యామవరం రఘువీర శర్మ కోరారు.

అన్నారం భూవివాదంపై బహిరంగ చర్చ.. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సిలర్ల భేటీ

అన్నారం గ్రామం సర్వే నెం. 261 భూముల వ్యవహారంపై మెజారిటీ కౌన్సిలర్లు ఆదివారం వార్డు కార్యాలయంలో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము విసిరిన బహిరంగ చర్చ సవాల్‌కు ప్రత్యర్థి వర్గం హాజరుకాలేదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములతో పాటు మాజీ సైనికులకు కేటాయించిన స్థలాలు బెనామీ పేర్లతో ఆక్రమణకు గురయ్యాయని, ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజా అవసరాలకు వినియోగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కోరనున్నట్లు తెలిపారు.సమావేశానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వార్డు కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేయడంతో కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా, కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు:మూడుచింతల నరేందర్‌రెడ్డి, బెంబడి సంజీవరెడ్డి, మేడిపల్లి మురళీ, అభిశెట్టి రాజశేఖర్, చక్రపాణి, ఆర్ల కిషన్, సద్ది జైపాల్‌రెడ్డి, నర్సంపల్లి రాజిరెడ్డి, మద్దిసోని, గిద్దె విజయలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు మైత్రి ఫౌండేషన్ చేయూత

మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ తండ్రి చెన్నంశెట్టి సత్యనారాయణ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా భోజన విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారి సేవలను గుర్తిస్తూ చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి కృషిని గుర్తించి అభినందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

గుమ్మడిదల మున్సిపాలిటీ వ్యాప్తంగా ప్రతి ప్రజా సమస్యపై పోరాడుతాం

అన్నారంలో జరిగిన పరిణామాలపై 13 మంది కౌన్సిలర్ల కూటమి ధీటుగా స్పందన

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం 261లో చోటుచేసుకున్న పరిణామాలపై మెజారిటీ వార్డు కౌన్సిలర్లు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి తమ వైఖరిని వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా అక్రమాలను ప్రశ్నించే హక్కు తమకు రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలు కల్పించాయని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన పరిశ్రమ ప్రహరీ గోడను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తొలగించిన అనంతరం వాస్తవాలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్లగా కొందరు అడ్డుపడి అవాంఛనీయ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, ప్రజా ప్రయోజనాల కోసం రాజీపడకుండా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, రాజశేఖర్, మురళి, చక్రపాణి, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, కిషన్, విజయలక్ష్మి, సోనీ, వరలక్ష్మి, నిర్మల, పద్మ పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక శోభితం శ్రీ గాయత్రి దేవి క్షేత్రం..- బీహెచ్‌ఈఎల్ విద్యుత్ నగర్‌లో భౌమ అమావాస్య ప్రత్యేక పూజలు..- వైభవంగా మహా చండీ సహిత బగాలాముఖి హోమం..

పటాన్ చెరు, జూలై 14 బీహెచ్ఈఎల్ విద్యుత్ నగర్ ఎంఐజీ కాలనీలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ వేదమాత గాయత్రీ దేవి క్షేత్రము ప్రాంగణంలో భౌమ అమావాస్య, నిజ జ్యేష్టా అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు, అర్చకులు రఘువీర శర్మ పర్యవేక్షణలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని లోక కల్యాణార్థం, భక్తుల సకల జనాకర్షణ, శత్రు నివారణ కు, పీడా నివారణల కోసం ఆలయంలో “మహా చండీ సహిత బగాలాముఖి హోమం” అత్యంత నిష్ఠతో నిర్వహించారు. రఘువీర శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయగా, హోమ గుండం నుండి వెలువడిన పవిత్ర ధూమంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.అదేవిధంగా గ్రహ దోషాలు, కాల సర్ప దోషాల నివారణకై ఉగ్ర స్వరూపుడైన కాలభైరవ స్వామికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అమావాస్య విశిష్టతను పురస్కరించుకుని ఇక్కడి కాళికా దేవిని భయంకర, రక్షణ స్వరూపమైన ప్రత్యేక భద్రకాళి దేవిగా అలంకరించి పూజలు చేశారు. కాళికా దేవికి, కాల భైరవుడికి జరిగిన ఈ ప్రత్యేక సమర్చనా కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దోష నివారణ కోసం, మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూష్మాండ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీనితో పాటు పంచలింగముఖ ఉమామహేశ్వరునికి శైవాగమ పద్ధతిలో ప్రత్యేక బిల్వార్చన, శివారాధన కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు.పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్, విద్యుత్ నగర్, ఎంఐజీ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రఘువీర శర్మ మాట్లాడుతూ… అమావాస్య రోజున, ముఖ్యంగా భౌమ అమావాస్య నాడు అమ్మవారికి, కాలభైరవునికి చేసే ఇటువంటి విశేష పూజల వల్ల నకారాత్మక శక్తులు తొలగిపోయి, ఇండ్లలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయని భక్తులకు వివరించారు.

కాలువలు కబ్జా… అధికారుల కళ్లముందే ప్రకృతి నాశనం!

  • రామేశ్వరం బండలో వెంచర్ల రాజ్యం

ఇరిగేషన్ శాఖ నిద్రలో… ప్రజలు ముంపులో!

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో వెంచర్ల దందా బహిరంగంగా కొనసాగుతోంది. సహజ కాలువలు, కల్వర్టులను నిర్దాక్షిణ్యంగా మూసివేస్తూ రోడ్లు వేస్తున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామంలో పలు కీలక నీటి మార్గాలను మట్టితో నింపి పూర్తిగా బ్లాక్ చేయడంతో వర్షాకాలంలో నీరు ఎక్కడికక్కడ నిల్వై ముంపు పరిస్థితులు ఏర్పడిే అవకాశాలున్నాయి. రైతుల పంటలు నాశనం కావడమే కాకుండా, ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా జరుగుతున్నా కాలువల పరిరక్షణ బాధ్యత వహించే ఇరిగేషన్ శాఖ మాత్రం నిద్రలోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మౌనం వెనుక వారి లాభ ఎంతో? అధికారులు స్పందించకపోవడం వల్లే వెంచర్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ, సహజ నీటి ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, భవిష్యత్తులో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలువలను తక్షణమే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఐలాపూర్ భూముల్లో హైడ్రాకు ప్రవేశించే హక్కు లేదు: న్యాయవాది ముఖీమ్

ఐలాపూర్ భూముల విషయంలో న్యాయస్థానాల పరిధిలో రిట్ అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున, హైడ్రా అధికారులకు ఆ భూముల్లోకి ప్రవేశించే హక్కు లేదని న్యాయవాది ముఖీమ్ తేలిపారు . బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్, హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తమకు అనుకూలమైన డిక్రీ ఉందని, నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా అధికారులు నిత్యం వాహనాలతో తిరుగుతూ వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం అమీన్‌పూర్ రెవెన్యూ అధికారుల అతిచర్యేనని ఖండించారు. హైడ్రా అధికారి రంగనాథ్‌తో కలిసి ఒక నూతన సొసైటీ భారీ భూకుంభకోణానికి తెరలేపిందని, త్వరలోనే ఆ గుట్టు రట్టు చేస్తామని హెచ్చరించారు. చట్టబద్ధమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకోవడం తగదని, గ్రామస్థులెవరూ భయపడవద్దని, న్యాయస్థానాలు రక్షణ కవచంలా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఐలాపూర్ భూముల విషయంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయమనంతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివాదాస్పదం కాని భూముల జోలికి వెళ్లొద్దని ఎమ్మార్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిరుత దాడిలో లేగదూడ మృతి

కాజిపల్లి అటవీ ప్రాంతంలో కలకలం

సలాం హైదరాబాద్: జిన్నారం మండలం గడ్డపోతారం పురపాలక సంఘం పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మళ్లీ భయాందోళన సృష్టించింది. శుక్రవారం కాజీ చెరువు సమీపంలో మేత మేస్తున్న లేగదూడపై దాడి చేసి చంపింది. చిరుత లేగదూడను చంపుతుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరి గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో చాలా రోజులుగా చిరుత సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. మృతి చెందిన లేగదూడ కాజిపల్లి గ్రామానికి చెందిన గద్దె కృష్ణ అనే రైతుదిగా గుర్తించారు.

ఎమ్మెల్యే జీఎంఆర్ ను కలిసిన జిన్నారం పాలకవర్గం

పటాన్ చెరు, మార్చి 03: హోలీ పండుగ సందర్భంగా జిన్నారం మున్సిపల్ చైర్మన్ యాట జనార్ధన్ నేతృత్వంలో పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తదితరులు పాలకవర్గం సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.