నీలోఫర్ ఆసుపత్రి నుంచి ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం
గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. నీలోఫర్ ఆసుపత్రిలో తలసేమియా పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆసుపత్రి సిఎస్ నాగజ్యోతి, సూపరిండెంట్ విజయ్ కుమార్‌లు ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్‌కు ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తమ సేవలకు లభించిన గౌరవమని, మాపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

