సలాం హైదరాబాద్ ప్రతినిధి:-గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను నేరుగా కలిశారు.ఈ సందర్భంగా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే అభివృద్ధి పనులకు మరింత వేగం వస్తుందని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డు సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను తెలుసుకుని అభివృద్ధి దిశగా నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధి బాటలో ముందుకెళ్లేందుకు అధికార పార్టీకి మద్దతు తెలపండి 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు ప్రచారం
RELATED ARTICLES

