అన్నారం గ్రామం సర్వే నెం. 261 భూముల వ్యవహారంపై మెజారిటీ కౌన్సిలర్లు ఆదివారం వార్డు కార్యాలయంలో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము విసిరిన బహిరంగ చర్చ సవాల్‌కు ప్రత్యర్థి వర్గం హాజరుకాలేదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములతో పాటు మాజీ సైనికులకు కేటాయించిన స్థలాలు బెనామీ పేర్లతో ఆక్రమణకు గురయ్యాయని, ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజా అవసరాలకు వినియోగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కోరనున్నట్లు తెలిపారు.సమావేశానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వార్డు కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేయడంతో కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా, కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు:మూడుచింతల నరేందర్‌రెడ్డి, బెంబడి సంజీవరెడ్డి, మేడిపల్లి మురళీ, అభిశెట్టి రాజశేఖర్, చక్రపాణి, ఆర్ల కిషన్, సద్ది జైపాల్‌రెడ్డి, నర్సంపల్లి రాజిరెడ్డి, మద్దిసోని, గిద్దె విజయలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అన్నారం భూవివాదంపై బహిరంగ చర్చ.. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సిలర్ల భేటీ
RELATED ARTICLES

