పటాన్ చెరు, మార్చి 03: హోలీ పండుగ సందర్భంగా జిన్నారం మున్సిపల్ చైర్మన్ యాట జనార్ధన్ నేతృత్వంలో పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పాలకవర్గం సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో ఉత్సాహంగా హోలీ వేడుకలు
హాజరైన సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి..
సలాం హైదరాబాద్: గుమ్మడిదల పట్టణంలో హోలీ పండుగను యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రధాన వీధులు రంగుల కాంతులతో కళకళలాడాయి. యువకులు పరస్పరం రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పలుచోట్ల సంగీతంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని యువతతో కలిసి రంగులు చల్లారు. పండుగలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, స్నేహభావంతో సంబరాలు జరుపుకోవాలని సూచించారు. రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, మహిపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంటి మల్లేష్ తదితరులు పాల్గొనారు.
వీరభద్ర స్వామి ఆలయానికి గ్రహణ విరామం..
రేపు ఉదయం నుంచి నిత్య పూజలు ప్రారంభం…
సలాం హైదరాబాద్ గుమ్మడిదల :- పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం వార్డులోనీ ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం నిత్యకర్మలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేసి గ్రహణ కాలమంతా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రేపు తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య పూజలు, సాధారణ దర్శనాలు కొనసాగనున్నాయి.
శ్రీవివేకానంద స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం
- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
- విద్యా సందేశాలతో మెరిసిన చిన్నారులు
- హాజరైన ప్రజాప్రతినిధులు..
గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని శ్రీవివేకానంద స్మార్ట్ కిడ్స్ హై స్కూల్ గుమ్మడిదలతో పాటు ఆచార్యాద స్కూల్ అన్నారం విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ చిమ్ముల మల్లారెడ్డి, కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతా రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు దేవలోకంలోని దేవకన్యల వేషధారణలతో నృత్యాలు ప్రదర్శించారు. బుడిబుడి అడుగులతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను మైమరిపించాయి. జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, సామాజిక అంశాలపై రూపకాలు, ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ వంటి అంశాలపై ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనిమల్ డే సందర్భంగా జంతువుల వేషధారణలో ఇచ్చిన సందేశాత్మక ప్రదర్శన ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
విద్యార్థుల విద్యా ప్రగతిని ప్రతిబింబించే సైన్స్ మోడల్స్, ఆంగ్ల ప్రసంగాలు, గణిత నైపుణ్య ప్రదర్శనలు నిర్వహించారు. విద్యతో పాటు సాంస్కృతికాభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా రాత్రి క్రికెట్ పోటీలు
గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగారంలో భాగంగా రాత్రి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. యువ నాయకుడు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని.. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్ నిర్వహణలో నరేష్, రాజశేఖర్, రాకేష్, రవి, భీకరం దాస్, అంజన్ గౌడ్, సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ పాల్గొంటున్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రికెట్ పోటీలు
గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగారంలో భాగంగా మండలంలో నేడు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు యువ నాయకులు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం యువతను ఉత్సాహ పరిచే విధముగా మహాశివరాత్రి రోజు ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు సాయంత్రం 5 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్లుగా నరేష్, రాజశేఖర్ , రాకేష్, రవి, భీకరం దాస్ ,అంజన్ గౌడ్ , సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ వివరిస్తున్నారని యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అభివృద్ధి బాటలో ముందుకెళ్లేందుకు అధికార పార్టీకి మద్దతు తెలపండి 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు ప్రచారం
సలాం హైదరాబాద్ ప్రతినిధి:-గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను నేరుగా కలిశారు.ఈ సందర్భంగా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే అభివృద్ధి పనులకు మరింత వేగం వస్తుందని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డు సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను తెలుసుకుని అభివృద్ధి దిశగా నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి బాటలో ముందుకు సాగాలిఅన్నారం 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సత్పడి భానుచందర్
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సత్పడి భానుచందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి మార్గంలో భాగస్వాములుగా మారాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
స్థానికంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు వంటి కీలక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని వెల్లడించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు
నీలోఫర్ ఆసుపత్రి నుంచి ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం
గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. నీలోఫర్ ఆసుపత్రిలో తలసేమియా పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆసుపత్రి సిఎస్ నాగజ్యోతి, సూపరిండెంట్ విజయ్ కుమార్‌లు ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్‌కు ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తమ సేవలకు లభించిన గౌరవమని, మాపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.
లిప్పన్ కళారూపానికి ఆధునికతగీతంలో నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకార వేడుక
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకారం యొక్క ఉత్సాహభరితమైన వేడుకను నిర్వహించి, లిప్పన్ కళ యొక్క కాలాతీత ఆకర్షణను సమకాలీన వెలుగులోకి తీసుకొచ్చింది. శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక లెన్స్ ద్వారా తిరిగి ఊహించుకుంటూ, సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్ సున్నితత్వాలతో మిళితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది కళాశాలలకు చెందిన 55 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ఒకరికి మరొకరు సహకరించుకోవడంతో పాటు ఇతరులతో పరిచయాలను పెంచుకుని, తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సాంప్రదాయ చేతిపనుల యొక్క సాధారణ అన్వేషణగా ప్రారంభమై, ఆవిష్కరణ, బృంద కృషి, కళాత్మక వ్యక్తీకరణలతో కూడిన కాన్వాస్ గా పరిణామం చెందింది. స్కెచ్ బుక్ లు సంక్లిష్టమైన నమూనాలతో రోజంతా వికసించాయి. నైపుణ్యం కలిగిన చేతుల కింద గాలికి ఎండిపోయిన బంకమట్టి రూపాంతరం చెంది, చేతిపనులను ప్రతిబింబించాయి. వర్ధమాన వాస్తుశిల్పులు శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక మెరుగులద్దారు. నెక్సెస్ లో పాల్గొన్న వారంతా తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, నేటి నిర్మాణ, కళాత్మక వ్యక్తీకరణలలో సాంప్రదాయ మూలాంశాలు తాజా అర్థాన్ని ఎలా పొందవచ్చో అన్వేషించడంతో వాతావరణమంతా శక్తి, ఊహతో సజీవంగా మారింది. తత్ఫలితంగా, భారతదేశ కళాత్మక వారసత్వాన్ని, యువత ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబించే సృజనాత్మక ప్రదర్శనగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షా నోముల (యూనిట్ సెక్రటరీ, మూడో సంవత్సరం), జక్కిడి అద్వయ స్ఫూర్తి (యూనిట్ డిజైనర్, రెండో సంవత్సరం)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రుతి గావ్లి సమన్వయం చేశారు.
